మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలి: టీపీసీసీ

Minister MalLa Reddy Should take action Says Nagi reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డికి టీపీసీసీ ఫిర్యాదు చేసింది. వచ్చేనెల 27 వరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా మల్లారెడ్డి తన అధికార లెటర్‌హెడ్‌పై పార్టీ పదవి నియామకం చేస్తూ ఉత్తర్వు లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించడమేనని నాగిరెడ్డికి ఇచ్చిన ఫిర్యా దులో టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కీసర మండల అధ్యక్షుడిగా సుధాకరరెడ్డిని నియమిస్తూ మంత్రి ఇచ్చిన నియామకపత్రం ప్రతిని కూడా ఈ ఫిర్యాదుకు జతచేశారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top