శరద్‌పవార్‌తో బీసీ నేతల భేటీ..

Meet BC leaders with Sharad Pawar - Sakshi

యూపీఏ మేనిఫెస్టోలో బీసీ రిజర్వేషన్ల హామీకి వినతి  

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా రాబోయే యూపీఏ ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇస్తుందని, ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ వాగ్దానాన్ని చేరుస్తామని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ హామీ ఇచ్చినట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం ఇక్కడ శరద్‌ పవార్‌ను ఆయన నివాసంలో బీసీ నాయ కులు కలిశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర బీసీ సంఘాల నేతలను ఆహ్వానించి బీసీ సమస్యలపై పవార్‌ అరగంట సేపు చర్చలు జరిపారని కృష్ణయ్య వివరించారు.

అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారని పవార్‌ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇస్తే తప్ప ఈ కులాలకు న్యా యం జరగదన్నారు. దీనిపై పవార్‌ స్పందిస్తూ బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల పక్షాన నిలబడతానని హామీనిచ్చినట్టు తెలిపారు. బీసీల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్ట డానికి అంగీకరించారన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, రవీందర్, నీల వెంకటేశ్, భూపేశ్‌ సాగర్, తాండూరు గోపీనాథ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top