ధ్యానం చేయడం వల్ల మనస్సులోని దివ్యత్వం బయటికి వచ్చి, స్వానుభవం పొందడమే ధ్యానమని ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు.
కడ్తాల/ఆమనగల్లు: ధ్యానం చేయడం వల్ల మనస్సులోని దివ్యత్వం బయటికి వచ్చి, స్వానుభవం పొందడమే ధ్యానమని ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో నిర్వహిస్తున్న ధ్యాన సంబరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.
తెల్లవారుజామున 5 నుంచి 7గంటల వరకు పత్రీజీ ఆధ్వర్యంలో సామూహిక వేణుగాన ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులను ఉద్దేశించి పత్రీజీ సందేశమిచ్చారు. ధ్యానం అంటే శ్వాసమీద ధ్యా స, గొప్పపుస్తకాలు చదవడం, మంచివారితో స్నేహం చేయడం, మౌనం, శాఖాహారం తదితర పనులతో చిన్నప్పటి నుండే సాధన చేయడంతో ధ్యానం నేర్చుకోవచ్చని చెప్పారు.
ధ్యానం చేస్తే వారికి వారే మిత్రుడని, ధ్యానం తెలిసినవారు యోగిలా ఉండాలన్నారు. వైరాగ్యాన్ని తిప్పికొట్టేందుకు ధ్యానం పుట్టిందన్నారు.సూక్ష్మశరీరం అనేక లోకాలు తిరిగి జ్ఞానం నేర్చుకోవడమే ధ్యానమన్నారు. భూలోకం గొప్ప ఆధ్యాత్మీక పాఠశాల అని, ఆధ్యాత్మిక అనుభవాలు పొం దడానికి మనమంతా భూలోకానిక వచ్చామని పత్రీజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన పుస్తకాలు ఆవిష్కరించడంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టార్లు తమధ్యాన అనుభవాలను వివరించారు. రాత్రి నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానుల ను ఆకట్టుకున్నాయి.
ముంబైకి చెందిన పండిత్ మిలింద్ రాయ్‌కర్ వాయలెన్ సంగీతం, ఖమ్మంకు చెందిన వికలాంగుడు అరుణ్‌కుమార్ నృత్యం, స్నేహలత భరతనాట్యం, అశ్వని కూచిపూడి నృత్యం అలరించాయి. క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో జనం పిరమిడ్‌ను సందర్శించేందుకు తరలివచ్చారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సాంబశివరావు, నందప్రసాద్, జెవీ రమణ, ప్రేమయ్య, రవిశాస్త్రి, నిర్మల, మాధవి, మల్లిఖార్జున్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.