యాదగిరిగుట్ట కోనేరులో మునిగి వ్యక్తి మృతి | man died in yadagirigutta | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్ట కోనేరులో మునిగి వ్యక్తి మృతి

Aug 10 2015 9:02 AM | Updated on Sep 3 2017 7:10 AM

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృతిచెందాడు.

యాదగిరిగుట్ట(నల్లగొండ): శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి ఆలయ కోనేరులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం యాదగిరిగుట్టలో జరిగింది. వివరాలు.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడాకు చెందిన బావాబామ్మర్దులు శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనానికి యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ క్రమంలో ఉదయం పుణ్యస్నానం ఆచరించడానికి కోనేరు వద్దకు వెళ్లారు. స్నానం చేస్తున్న సమయంలో బావ దుద్దిల రాజు(28)కు ఫిడ్స్ రావడంతో కోనేరులో మునిగి మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement