ప్రధాని మోదీ ఫొటో మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫేస్‌బుక్‌లో మోదీ మార్ఫింగ్ ఫొటో
Jul 24 2017 3:26 PM | Updated on Aug 15 2018 6:34 PM
- ఒకరి అరెస్ట్
నిజామాబాద్: ప్రధాని మోదీ ఫొటో మార్ఫింగ్ చేసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ ఓ షేక్ కాళ్లు మొక్కుతున్నట్లుగా ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లా వర్ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
మండల పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన గౌస్ అనే ఫొటోగ్రాఫర్ ప్రధాని పరువు తీసే విధంగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు పెడుతున్నాడంటూ బీజేపీ కార్యకర్తులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 121 సక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement