అచ్చంపేటలో కోదండరామ్‌ అరెస్టు..!

Kodandaram Arrest Protest Against Uranium Mining At Achampet In Nagarkurnool District - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు, పదర, అమ్రాబాద్ మండలాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. యురేనియం వెలికితీత వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజలతో చర్చించడానికి వచ్చిన కోదండరామ్‌ బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైందని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top