ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపయోగపడిన ఉపాధ్యాయులు ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు...
పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపయోగపడిన ఉపాధ్యాయులు ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు గుర్తుకు రాకపోవడం విడ్డూరమని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను అణచివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు.
పీఆర్‌టీయూ జూన్ 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధ ర్నా సన్నాహక సమావేశంలోవెంకట్‌రెడ్డి ప్రసంగించారు.సర్వీసు రూల్స్ అమల్లోకి తేవాలని, వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, రూ. 398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండితులు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్న డిమాండ్లతో ఈ పోరాటం తలపెట్టినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.