పూర్ణాహుతితో ముగిసిన చండీయాగం

KCR Maharudra Sahitha Sahasra Chandi Yagam Completed - Sakshi

సాక్షి, జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన మహారుద్ర సహిత సహప్ర చండీయాగం ముగిసింది. ఐదురోజుల పాటు కొనసాగిన ఈ యాగం విజయవంతంగా పూర్తయింది. యాగంలో చివరిరోజైన శుక్రవారం నాడు మొత్తం 8 మండపాలలో పుర్ణాహుతి జరిగింది. నేడు యాగానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కేసీఆర్‌ దంపతులు ప్రతీ మండపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. తొలుత రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, బుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. అనంతరం ప్రధాన యాగశాలైన చండీమాత మహా మండపంలో వేదపండితుల మంత్రోశ్చరణల నడుమ కేసీఆర్‌ దంపతులు పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులను కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top