సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.
హైదరాబాద్: సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. తమపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. తాము న్యాయమైన డిమాండ్ల సాధనకే సమ్మె చేస్తున్నామని సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తమది తప్పు అని తేలితే తమ డిగ్రీలు ప్రభుత్వానికి ఇచ్చేసి సమ్మె మానుకుంటామని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కోర్టు నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు.