కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధుల భేటీ | jimdhal company representatives meet the kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధుల భేటీ

Feb 19 2015 7:27 PM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధుల భేటీ - Sakshi

కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధుల భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధులు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో జిందాల్ కంపెనీ ప్రతినిధులు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక విధానాలపై వారు చర్చించారు. నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని జిందాల్ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ కంపెనీ సుముఖత తెలిపింది.అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకానికి అవసరమయ్యే పైపుల సరఫరాకు జిందాల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారంలో  ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ ముందుకు రాని పక్షంలో సిద్దంగా ఉండాలని జిందాల్ ప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement