'ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారు' | Jana Reddy Has Responded To The Murder Of Priyanka Reddy | Sakshi
Sakshi News home page

'ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారు'

Nov 30 2019 2:11 PM | Updated on Nov 30 2019 2:50 PM

Jana Reddy Has Responded To The Murder Of Priyanka Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రియాంక రెడ్డి హత్య కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. శనివారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక రెడ్డి హత్య కేసు తర్వాత తెలంగాణలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారని అన్నారు. ఆడపిల్లలు బయటికెళితే ఇంటికొచ్చే వరకు కుటుంబసభ్యులు భయపడుతూనే ఉంటున్నారని చెప్పారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని జానారెడ్డి విమర్శించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐపీఎస్ అధికారితో వెంటనే ఒక కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి.. బాధిత కుటుంబాలను పరామర్శిస్తే బాగుంటుందని, ప్రజల్లోకి మంచి మెసేజ్‌ వెళ్తుందని చెప్పారు. 

చదవండి: (హోం మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి)

చదవండి: (ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్‌ అలీ)

Advertisement
 
Advertisement
Advertisement