ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్‌ అలీ

Mahmood Ali Comments Over Priyanka Reddy Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి ఉదంతంపై తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. ప్రియాంకారెడ్డి హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. తన సోదరికి ఫోన్‌ చేసే బదులు బాధితురాలు 100 నంబరుకు కాల్‌ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని... ప్రియాంకారెడ్డి చేసిన చిన్న పొరపాటు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ప్రియాంకారెడ్డికి జరిగిన అన్యాయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

‘షాద్‌నగర్‌లో జరిగిన ఘటన విచారకరం. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో కూడా చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకున్నాం. ప్రియాంక కేసును కూడా స్వల్పకాలంలో ఛేదించారు. నలుగురిని అరెస్టు చేశారు. లోతుగా విచారణ జరిపించి నిందితులకు శిక్ష వేయిస్తాం. ఇక్కడి పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారు. అయితే ఉన్నత విద్యనభ్యసించి కూడా ప్రియాంక ఇలాంటి పొరపాటు చేయడం విచారించదగ్గ విషయం. రాత్రి సమయంలో తన సోదరికి ఫోన్‌ చేసే బదులు 100కి ఫోన్‌ చేయాల్సింది. పోలీసులు 3 నిమిషాల్లో అక్కడికి చేరుకునే వారు. పరిస్థితి చేయిదాటి పోకుండా ఉండేది’ అని మహమూద్‌ అలీ పేర్కొన్నారు.

కాగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీ పంక్చర్‌ అతికిస్తామంటూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. లారీని అడ్డుపెట్టి అత్యాచారానికి పాల్పడి..అనంతరం హతమార్చారు. ఆ తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అత్యంత హేయమైన చర్యలకు పాల్పడిని నలుగురిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితులది మహబూబ్‌నగర్‌ జిల్లాగా గుర్తించారు. అయితే తమ ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతో ఉండేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ రాజధానిలో నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. దర్యాప్తు నివేదిక అందజేయాల్సిందిగా రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని రాష్ట్రానికి పంపనుంది.

నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి

ప్రియాంకను రాత్రంతా చిత్రహింసలు పెట్టి..

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top