'బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ' | it's not a gold telangana, says vamsi | Sakshi
Sakshi News home page

'బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ'

Feb 23 2015 7:46 PM | Updated on Sep 2 2017 9:47 PM

'బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ'

'బంగారు తెలంగాణ కాదు బాధల తెలంగాణ'

కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బాధల తెలంగాణగా మారిందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు.

అచ్చంపేట(మహాబూబునగర్): కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బాధల తెలంగాణగా మారిందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే ఫించన్లు, రేషన్‌కార్డులు అందిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నియోజకవర్గానికి ఇంతమందికి సభ్యత్వం తీసుకోవాలని ప్రజలను బలవంత పెడుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటిపన్నులు, నల్లా బిల్లులులను వృద్ధాప్య పింఛన్ల నుంచే వసూలు చేస్తుందని తెలిపారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం అందిస్తానని హామీనిచ్చిన ప్రభుత్వం దొడ్డు బియ్యాన్నే సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధించుకుందామని చెప్పిన కేసీఆర్ పనితీరుతో బాధల తెలంగాణాగా మారిందని ఎద్దేవా చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనాకాలంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement