హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. మిజోరాం రాష్ట్రానికి చెందిన బీర్బల్ లాజిస్టిక్ సైన్స్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎల్ బ్లాక్ హాస్టల్ మూడో అంతస్తు నుండి అర్థరాత్రి కిందకు దూకాడు.
తీవ్రంగా గాయపడిన అతనిని హాస్టల్ సిబ్బంది హుటాహుటిన గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తోటి విద్యార్థులు చెప్రారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.