నాపై దాడి చేసింది ఆయనే : జబర్దస్త్‌ వినోద్‌

House Owner Attacked Me Jabardasth Vinod Says - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఇంటి ఓనరే తనపై దాడి చేశారని జబర్దస్త్‌ వినోద్‌ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమిల, బాలాజీకు రూ.10లక్షలు ఇచ్చామని, వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్ చేసుకుందామని రమ్మని హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రగాయాలపాలైన వినోద్‌.. నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

(చదవండి : ‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top