జనగామ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి ఓ చరిత్ర ఉందని ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు...
- ప్రముఖ కవి నందిని సిధారెడ్డి
- తరిగొప్పులలో ‘ప్రాస కెరటాలు, వరికుప్పలనే తలకొప్పులుగా’ పాటల ఆవిష్కరణ
తరిగొప్పుల(నర్మెట) : జనగామ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి ఓ చరిత్ర ఉందని ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. మండలంలోని తరిగొప్పుల గ్రామానికి చెందిన జంగ వీరయ్య రచించిన ప్రాసకెరటాలు, యాకూబ్ పాషా పాడిన వరికుప్పలనే తలకొప్పులలో తరిగొప్పులగా అనే పాట ఆవిష్కరణ సమావేశం తరిగొప్పులలో ఆదివారం జరిగింది.
సమావేశానికి ప్రముఖ కవులు నందిని సిధారెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తరిగొప్పుల గ్రామంలో ప్రజలం తా కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభగల రచయితలను గుర్తించలేకపోయార ని అన్నారు. తెలంగాణలో పేద కుటుంబం నుంచి అనేక మంది కవులు, కళాకారులు ఉన్నారని తెలిపారు. వారందరికి ప్రత్యేక తెలంగాణలో గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన రచయితలు, తమ అనుభవాలను పాటలు, రచనల రూపంలో అందించడం గొప్ప విషయమ న్నారు. తరిగొప్పుల గ్రామా న్ని వరికొప్పులగా పిలిచేవారని అన్నారు. ఎక్కడ చూసిన వరికుప్పల రాశులు, తరిపొలాలతో ఉండేదన్నారు. కార్యక్రమంలో రచయితలు బిల్ల మహేందర్, భువనగిరి రాములు, కె.యం.జాన్, లింగంపల్లి రాంచంద్రమూర్తి, సర్పంచ్ సిద్దిని మహిపాల్, ఉపసర్పంచ్ రాజు, ఎంపీటీసీలు మౌనిక, సంపత్, జంగవీరయ్య, బృంగి పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.