వైభవంగా సాముహిక వివాహాలు | Grander group marriages | Sakshi
Sakshi News home page

వైభవంగా సాముహిక వివాహాలు

Mar 23 2014 3:19 AM | Updated on Sep 2 2017 5:01 AM

వైభవంగా సాముహిక వివాహాలు

వైభవంగా సాముహిక వివాహాలు

మండలంలోని ఝరి(బి) గ్రామంలో ఉన్న మహదేవ్ ఆలయ ప్రాంగణంలో శనివారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

తానూరు, న్యూస్‌లైన్ : మండలంలోని ఝ రి(బి) గ్రామంలో ఉన్న మహదేవ్ ఆలయ ప్రాంగణంలో శనివారం సామూహిక వివాహా లు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన ఏడు జంటలకు ఒకే వేదికపై వివాహం జరిపించారు. సామూహిక వివాహాలతో ఖర్చు తగ్గుతుందని గ్రామస్తులు నిర్ణయిం చారు.

మూడేళ్లుగా సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. వేడుకలకు బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపటేల్, మాజీ మండల అధ్యక్షుడు బాసెట్టి రాన్న, ముథోల్ ఎమ్మెల్యే సతీమణి రేవతి, నాయకులు చంద్రకాంత్‌యాదవ్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement