ఎమ్మెల్యే హరిప్రియకు ఘన స్వాగతం 

 Grand Welcome To MLA Haripriya In Yellandu - Sakshi

సాక్షి, ఇల్లెందు: టీఆర్‌ఎస్‌లో చేరడంపై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లి.. వారం తరువాత నియోజకవర్గానికి తిరుగుముఖం పట్టిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆమె రాకను పురష్కరించుకుని అటు టీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి స్వాగతం పలికారు. భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తొలుత ఇల్లెందు నుంచి బయలు దేరిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు బయ్యారం సరిహద్దు నుంచి స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు.

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగాల రాజేందర్, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కనగాల పేరయ్య, పులిగళ్ల మాధవరావు, గడ్డం వెంకటేశ్వర్లు, లింగాల జగన్నాధం, బండారి వెంకన్న, మేకల మల్లిబాబు యాదవ్, ప్రముఖ విద్యాసంస్థల అధిపతి దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు కొక్కు నాగేశ్వరరావు, ధాస్యం ప్రమోధ్‌కుమార్, యలమద్ధి రవి, సయ్యద్‌ ఆజం, సుధీర్‌తోత్లాలు అగ్ర భాగంలో నడిచారు. నెహ్రూనగర్, ముకుందాపురం, రాజీవ్‌నగర్‌ తండా, మహబూబాబాద్‌ క్రాస్‌ రోడ్డు, ఇల్లెందు కొత్తబస్టాండ్, జగదాంబా సెంటర్‌ మీదుగా వెళ్లిన ఎమ్మెల్యే.. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు కొత్త బస్టాండ్‌ సెంటర్‌లో కొమురం భీం, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జగదాంబా సెంటర్‌లో తెలంగాణ తల్లికి పూలమాలలతో నివాళులర్పించారు.

కార్యక్రమాల్లో లాకావత్‌ దేవీలాల్‌ నాయక్, భావ్‌సింగ్‌ నాయక్, సూర్నబాక సత్యనారాయణ, దనుంజయ్, జేకే శ్రీను, భింగి వెంకన్న, మునిగంటి శివ, పోషం, వంగా సునిల్, మార్కెట్‌ రాజు, యలమందల వాసు, మధారమ్మ, వార రవి, ఆంజనేయులు, మెరుగు కార్తీక్‌ యాదవ్, వెంకటేష్, శ్రీకాంత్, కాంగ్రెస్‌ నేతలు నందకిశోర్, ఉప్పు శ్రీను, మనోహర్‌ తివారీ, ఓం, రవిప్రకాష్, దీపక్, ఎల్‌.కృష్ణ, గాజీ, రాజీవ్, మురళీ, మేకల శ్యాం, కడియాల అనిత,కంభంపాటి రేణుక, మంజ్యా శ్రీను, వత్స వెంకన్న, నూనావత్‌ లష్కర్, కొక్కు వెంకన్న, నల్ల సత్యనారాయణ,కొక్కు వెంకటేష్, మూల శ్రీనివాస్, వాసవీ రవీందర్, బొల్లి కొమురయ్య,భోజ్యా, జుంకిలాల్, వట్టం రాంబాబు, జీవనకుమారి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.  

ఇల్లెందు: ఎమ్మెల్యే బానోతు హరిప్రియ రాక కోసం పట్టణంలో పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ శ్రేణులు వాహనాలతో తరలి వెళ్లింది.  ఇల్లెందు నుంచి బయ్యారం వరకు దారి పొడవునా ర్యాలీగా తరలి వెళ్లారు.  కార్లు, టాటా ఏసీలు, మ్యాజిక్‌లు, ఆటోలు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి.  

 పూలమాలలు, శాలువాతో సన్మానం.. 
టేకులపల్లి: సీఎం కేసీఆర్‌ఆర్‌ను కలిసిన తరువాత తొలిసారి టేకులపల్లికి వచ్చిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ నాయక్‌ను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు, అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం టేకులపల్లికి వచ్చిన ఆమెను బోడు క్రాస్‌ రోడ్డు సెంటర్‌లో పూలు చల్లుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, హరిప్రియ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను గెలిపించిన వారికి, అభిమానంతో స్వాగతం పలికిన వారికి, తన వెంట నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడ బాలు, కంభంపాటి చంద్రశేఖర్, భూక్య లాలు, బాణోతు రామ, కందస్వామి, నల్లమాస రాజన్న, ఎం.శివకృష్ణ, ప్రసాద్, వీరు, శంకర్, కిషన్,   సూర్య,  కృష్ణ    తదితరులు  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top