
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ చూడ ని శాంతియుత ప్రజా ఉద్యమం ద్వారా 2014 లో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు. గత ఆరేళ్లలో రాష్ట్రం వినూత్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ స్పష్టంచేశారు. ‘బంగారు తెలంగాణ’లక్ష్యాన్ని త్వరలోనే అందుకోగల మని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్– 19తో ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నార ని కొనియాడారు. తెలంగాణ ‘సంపన్న, ఆరోగ్యకరమైన రాష్ట్రం‘అని నిరూపిస్తూ విజయవంతంగా బయటకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మై స్టేట్ – మై ప్రైడ్’’అనే అనుభూతితో రాష్ట్ర ప్రజలు గర్వపడే స్థాయిలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.