యంత్రాల యూనిట్‌కు భూములివ్వండి | give Land to the unit of machinery | Sakshi
Sakshi News home page

యంత్రాల యూనిట్‌కు భూములివ్వండి

Jun 17 2017 2:43 AM | Updated on Sep 5 2017 1:47 PM

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రైతులకు లబ్ధి చేకూ ర్చే ఆధునిక సాగు యంత్రాల యూనిట్‌

సర్కారుకు శక్తిమాన్‌ ఆగ్రో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి రైతులకు లబ్ధి చేకూ ర్చే ఆధునిక సాగు యంత్రాల యూనిట్‌ నెలకొల్పేందుకు భూములు కేటాయించా లని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమ ల్లును శక్తిమాన్‌ ఆగ్రో కంపెనీ ప్రతినిధులు కోరారు. రాష్ట్రంలో భూముల పరిశీలనకు  హైదరాబాద్‌ వచ్చిన కంపెనీ ప్రతినిధులు శుక్రవారం పరిశ్రమ భవన్‌లో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డిని కలిశారు.

కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. 71 దేశాల్లో తమ కంపెనీ యూనిట్లున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం ప్రత్యేక ఆసక్తిని కనబర్చిందని, అనుకూలమైన భూములు కేటాయించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా జిల్లెల, కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌ మండలంలో పలు భూములను కంపెనీ ప్రతినిధులకు చూపించామని, జిల్లెలలో 200 ఎకరాలివ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా సంసిద్ధత వ్యక్తం చేసిందని నర్సింహారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement