కాళేశ్వరం ఇంజనీరింగ్‌ అద్భుతం: బాలమల్లు

Balamallu about kalweswaram project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ సాగునీటి, ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో అత్యద్భుతమైన ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ప్రతీక కాళేశ్వరం ప్రాజెక్టని ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు అన్నారు. బాలమల్లు సారథ్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయన యాత్రను చేపట్టింది. 

మేడారంలో జరుగుతు న్న పనులతోపాటుగా పెద్దపల్లి జిల్లాలో గోదా వరి నదిపై నిర్మిస్తున్న అన్నారం బ్యారేజ్, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, ధర్మారం మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్‌ 6 కింద చేపడుతున్న సర్జ్‌ పూల్, టన్నెల్‌ నిర్మాణ పనులను ఈ బృందం బుధవారం పరిశీలించింది. ఈ ప్రాజెక్టు పనుల పురోగతి గురించి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లును ఈ బృందం అడిగి తెలుసుకుంది. 9.34 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న డబుల్‌ టన్నెల్‌(సొరంగ) నిర్మాణ పనులను, 4,800 మెగావాట్ల విద్యుత్‌ వినియోగంతో కూడిన 7 పంపు హౌస్‌లకు సంబంధించిన పనుల పురోగతిని కూడా ఈ బృందానికి వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top