కామాంధుడి దాష్టీకం | Girl commits suicide after being attempt to rape in warangal | Sakshi
Sakshi News home page

కామాంధుడి దాష్టీకం

Dec 2 2014 9:49 AM | Updated on Sep 2 2017 5:28 PM

కామాంధుడి దాష్టీకం

కామాంధుడి దాష్టీకం

అభం శుభం తెలియని బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారయత్నం చేశాడు.

* బాలికకు ఆశ్లీల చిత్రాలు చూపిస్తూ అత్యాచారయత్నం
*మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
*పోలీసుల అదుపులో నిందితుడు
* వరంగల్ జిల్లాలో ఘటన


 ధర్మసాగర్: అభం శుభం తెలియని బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు ఆమెను రక్షించగా.. అత్యాచార యత్నంతో మనస్తాపానికి గురై  ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోడాషపల్లిలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాలిక (14) మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు బంధువుల అంత్యక్రియలకు వెళ్లడంతో ఒంటరిగా ఉంది.

అదే గ్రామానికి చెందిన రేనుకుంట్ల సదానందం(30) బాలిక ఒంటరిగా ఉండటంతో ఆమెకు మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. స్థానిక యువకులు గమనించి, సదానందంను బంధించారు. తనపై అత్యాచారయత్నం జరగడంతో ఆ బాలిక మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్పి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలిక సోమవారం ఉదయం మృతి చెందింది.  కాగా విద్యార్థిని ఆత్మహత్య వివరాలు వెల్లడించటానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు సదానందంపై నిర్భయతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement