వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అధికారులను ఆదేశించారు.
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ ఇలంబరితి
ఖమ్మం జెడ్పీసెంటర్ : వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తూ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రజా‘ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలన్నారు. వచ్చే నెల 6న మంచినీటి పథకాల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలపై కూలంకషంగా చర్చించనున్నట్లు చెప్పారు.
మంచినీటి పథకాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయూలన్నారు. విధివిధానాల రూపకల్పనకు ముందుగా ఒక మండలాన్ని పెలైట్ యూనిట్‌గా తీసుకుని పంచాయతీల ద్వారా మంచినీటి పథకాల నిర్వహణ చేపట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నివేదికలు రూపొందించాలని సూచించారు. నీటి సమస్య ఉన్న గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీరు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యలను నివారించేందుకు సర్పంచ్,ఎంపీడీవో,ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు. అధికారులు ప్రతిపాదనలు అందిస్తే మంచినీటి పథకాల నిర్వహణకు జడ్పీ ద్వారా నిధులు మంజూరు చేరుుస్తామన్నారు. పథకాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి నివేదికలు తయూరు చేయూలని సీఈవోను ఆదేశించారు.
బోరుబావుల తవ్వకాలకు వినియోగించిన నిధుల ఖర్చు, వాటి పనితీరు తదితరఅంశాలపై టాస్క్ ఫోర్సు ద్వారా తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవో వినయ్‌కృష్ణారెడ్డి, ఖమ్మం ,కొత్తగూడెం కార్యనిర్వాహక ఇంజనీర్లు మల్లేష్‌గౌడ్,రాఘవులు, డీఈలు,ఏఈలు తదతరులు పాల్గొన్నారు.