జర్నలిస్టుల పిల్లలకు ‘ప్రైవేటు’లో ఉచిత విద్య | Free Education For Journalists Children In Private Schools | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల పిల్లలకు ‘ప్రైవేటు’లో ఉచిత విద్య

Jun 13 2018 10:28 AM | Updated on Jun 13 2018 10:28 AM

Free Education For Journalists Children In Private Schools - Sakshi

వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టు నాయకులు 

మెదక్‌ మున్సిపాలిటీ : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించే అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు(టీయూడబ్లూజే హెచ్‌143) జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మంగళవారం యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ధర్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి వారి పిల్లలకు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యనందించాలన్నారు.

ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సురేందర్‌రెడ్డి, గోపాల్‌గౌడ్, స్టిఫెన్, శ్రీనివాస్, ఆంజనేయులు, రహమత్, దుర్గెష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement