నలుగురి విద్యార్థుల పరిస్థితి విషమం: యశోద వైద్యులు | Four injured students health critical says, Yashoda hospital | Sakshi
Sakshi News home page

నలుగురి విద్యార్థుల పరిస్థితి విషమం: యశోద వైద్యులు

Jul 24 2014 5:45 PM | Updated on Nov 9 2018 4:44 PM

మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి... హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్:  మెదక్ జిల్లా మసాయి పేట వద్ద రైలు ప్రమాదంలో గాయపడి... హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం విద్యార్థుల ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరో ఏడుగురు విద్యార్థులు వెంటిలేటర్పై ఉన్నారని తెలిపారు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముసాయిపేట వద్ద ఈ రోజు ఉదయం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 9 మంది విద్యార్థులను హైదరాబాద్ తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement