ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి | Formation Day manage to solid | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

May 31 2016 12:05 AM | Updated on Sep 4 2017 1:16 AM

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న మండలంలోని ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ మర్కల రజని సూచించారు.

శాయంపేట : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న మండలంలోని ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ మర్కల రజని సూచించారు. సోమవారం మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో మండలంలోని ప్రజాప్రతినిధులు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఎంపీపీ అధ్యక్షతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజని మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాం స్కృతిక కార్యక్రమాలు, ముగ్గులపోటీలు, మహిళలకు క్రీడలు నిర్వహిస్తామన్నారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీపీ బాసని రమాదేవి, ఈవోపీఆర్‌డి సరస్వతి, మండలంలోని గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 
చిట్యాలలో..

చిట్యాల : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించాలని ఈఓపీఆర్‌డీ చందర్ తెలిపారు. సోమవారం ఆయన  విలేకరులతో మాట్లాడుతూ మే 28 నుంచే గ్రామాలలో పాటల, ముగ్గుల, ఆటల పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. జూన్ 2న గ్రామపంచాయతీలలో తెలంగాణ జెండాను ఆవిష్కరించాలన్నారు. జనాభా ఎక్కువ గల గ్రామపంచాయతీ సర్పంచ్‌లు రూ.6వేలు, చిన్న గ్రామపంచాయితీల సర్పంచ్‌లు రూ.3వేలు జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేసుకోవచ్చన్నారు.

 
గణపురంలో..

గణపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జెడ్పీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్ అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ జూన్ 2న ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ప్రతిఒక్కరు  వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ర్యాలీలు, ఆటల పోటీలు, సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి., తహసీల్దార్  జివాకర్‌రెడ్డి, ఎంపీపీ పోతారపు శారద, ఎంఈఓ సురేందర్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, గంధం ఓధాకర్, మాధాటి సత్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 
ఉత్తములను గుర్తించకపోవడం విచారకరం..

చిట్యాల (మొగుళ్లపల్లి) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమంగా సేవలందించిన ఉద్యోగులను, సాహితీ వేత్తలను, రైతులను గుర్తించకపోవడం విచారకరమని సమాచార హక్కు చట్టం జిల్లా కోకన్వీనర్ కామిడి సతీష్‌రెడ్డి, చిట్యాల, మొగుళ్లపల్లి మండల కన్వీనర్లు దేవరకొండ సత్యనారాయణ, చర్లపల్లి వెంకటేష్‌గౌడ్ అన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉత్తములను గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్, మంత్రులు స్పందించి మండల స్థాయిలో ఉత్తములను గుర్తించాలని కోరారు.  సమావేశంలో రెండు మండలాల నాయకులు గుర్రపు శ్రీధర్, విజేంధ్రాచారి, తడవర్తి ప్రసాద్, సరిగొమ్ముల రాజు, గండు రమేష్, బిక్షపతి, రాజేందర్, సుమన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement