నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టు | five held for fake passports | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టు

Mar 3 2015 11:15 PM | Updated on Sep 2 2017 10:14 PM

సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్‌పోర్టులపై వచ్చిన ఐదుగురు ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్: సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్‌పోర్టులపై వచ్చిన ఐదుగురు ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు.

 

అక్కడ ఉద్యోగాలు కల్పించిన సంస్థలు తమ పాస్‌పోర్టులను లాగేసుకోవటంతో గత్యంతరం లేక నకిలీ పాస్‌పోర్టులపై వచ్చినట్లు వారు తెలిపారని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement