చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత | Fisherman death in pond | Sakshi
Sakshi News home page

చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత

Mar 7 2017 7:17 PM | Updated on Sep 5 2017 5:27 AM

చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత

చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై వ్యక్తి చనిపోయాడు.

కంగ్టి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై వ్యక్తి మృతి చెందిన సంఘటన కంగ్టి మండలంలోని తడ్కల్‌లో సోమవారం చోటుచేసుకొంది. స్థానికుడైన మత్స్యకారుడు పస్పుల రాములు (45) ఉదయం తడ్కల్‌ గ్రామ శివారులోని చిన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడడంతో వెంట వెళ్లిన వారు పసిగట్టి కాపాడే ప్రయత్నం చేసేలోపే నీటిలో మునిగి గల్లంతైనట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించి గ్రామస్తుల సహాయంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ నానునాయక్‌ సందర్శించి పంచనామా నిర్వహించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement