పని అక్కడ.. జీతమిక్కడ! | Fasten slavery in kamareddy town | Sakshi
Sakshi News home page

పని అక్కడ.. జీతమిక్కడ!

Jun 18 2015 8:49 AM | Updated on Sep 3 2017 3:57 AM

పని అక్కడ.. జీతమిక్కడ!

పని అక్కడ.. జీతమిక్కడ!

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను తమ ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించుకోవడం నేతలు, ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది.

కామారెడ్డిలో కట్టుబానిసత్వం
నేతల ఇళ్లల్లో బల్దియా కార్మికులు
కొందరు నాయకుల వాహన చోదకులు కూడా వారే
ఏటా రూ.15 లక్షల మున్సిపల్
నిధులు దుర్వినియోగం

 
కామారెడ్డి (నిజామాబాద్): మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను తమ ఇళ్లలో పని మనుషులుగా ఉపయోగించుకోవడం నేతలు, ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అంట్లు తోమడానికి, వా హనాలకు డ్రైవర్లుగా కూడా వారినే వినియోగించుకుంటున్నారు. వారికి వేతనాలు మున్సిపాలిటీ నుంచే అందుతాయి. కామారెడ్డి పట్టణంలో గడచిన పదిహేనేళ్లుగా కొనసాగుతున్న వ్యవహారం ఇది. మున్సిపాలిటీలో 30 మంది రెగ్యులర్ కార్మికులు కాగా, 281 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరిలో 155 మంది పారిశుధ్య విభా గంలో, 118 మంది నీటి సరఫరా, వీధి దీపాల విభాగంలో పనులు చేస్తుంటారు. మరో ఎనిమిది మంది కార్యాలయంలో పని చేస్తారు.

పారిశుధ్య కార్మికులుగా, నీటి స రఫరా విభాగంలో పని చేసేవారిగా రికార్డులలో పేరున్న 15 మంది కార్మికులు మాత్రం నేతల ఇళ్లలోనే కనిపిస్తారు. అక్కడ అంట్లు తోమడం, ఇళ్లు ఊడ్చడం నుంచి ఇం టి పనులన్నీ వారే చేస్తారు. కొందరు నేతల వాహన డ్రైవర్లకు కూడా మున్సిపాలిటీయే వేతనం ఇస్తుంది. ఎందుకంటే డ్రైవర్ల పేర్లు కాంట్రాక్టు కార్మికుల జాబితాలో ఉం టాయి కాబట్టి. మున్సిపాలిటీలో నడిచేది నేతల పెత్తనమే కాబట్టి అలా సాధ్యమవుతుంది మరి. ఇది ఏదో అధికార పార్టీ ఒక్కదానికి చెందిన నేతలకు సంబందించిన ఇష్యూ అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఎవరూ ప్రశ్నించకుండా అన్ని పార్టీల నేతల ఇళ్లల్లో కార్మికులు పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలలో గుర్తింపు పొందిన నేతలు, సీనియర్ కౌన్సిలర్లు, ప్రస్తుత ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిధులు.. ఇలా అందరి ఇళ్లల్లో మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు.దీంతో ము న్సిపాలిటీలో ప్రశ్నించేవారు లేకుండాపోయారు. ఏదైనా అందరూ కలిసే పంచుకునే పద్ధతికి అలవాటుపడిన వారు పని వారిని కూడా పంచుకుని ఇంటి పనిమనుషుల ఖర్చును తమ బడ్జెట్ నుంచి తొలగించుకున్నారు.

ఏటా రూ. 15 లక్షలు దుర్వినియోగం
ఒక్కో కార్మికునికి రూ. 8,200 వేతనంగా లభిస్తుంది. ఈ లెక్కన నేతల ఇళ్లలో పని చేసే 15 మంది కార్మికులకు నెలకు రూ.1.23 లక్షలు, ఏడాదికి రూ. 15 లక్షల వరకు ప్రజాధనం నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. గడచిన పదిహేనేళ్లుగా మున్సిపాలిటీలో ఈ విధానం అమలు అవుతుందంటే రూ.కోటికిపైగా ప్రజాధనం దుర్వినియోగమై ందనే విషయం స్పష్టమవుతోంది. ప్రజాధనాన్ని నేతల సొంతానికి వాడుకుంటుండడం బహిరంగ రహస్యం.ఇంత జరుగుతున్నా ఎవరూ నోరుమెదపరు. కాగా ప్రజలు చెల్లించే పన్నులతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్యం, నీరు, వీధిదీపాల వంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం ప్రజాధనాన్ని నేతల ఇళ్లలో పనిచేసే కార్మికులకు వెచ్చిస్తూ దుర్వినియోగానికి తమవంతు సహకారం అందిస్తున్నారు.

నేతల తీరు మారాలి
ప్రజలకు సేవ చేయాల్సిన కార్మికులను తమ ఇళ్లల్లో పనిచేయించుకునే నేతల ఆలోచనలలో మార్పు రావలసిన అవసరం ఉంది. ఏళ్ల తరబడిగా కార్మికులను తమ ఇం టి పనిమనుషులుగా, డ్రైవర్లుగా వాడుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజలలో నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నేతలు స్వ చ్ఛందంగా ముందుకు కార్మికులను మున్సిపాలిటీకి అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement