రూ. 45,770 కోట్లు  తప్పనిసరి ఖర్చు

The Expenditure On Salaries, Interest Payments And Pensions is Revealed in the CAG - Sakshi

జీత భత్యాలు,వడ్డీ చెల్లింపులు,పెన్షన్‌ల కోసం వ్యయం

కాగ్‌ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తప్పనిస రి ఖర్చు గుదిబండగా మారుతోంది. రెవెన్యూ వ్యయంలో సగం ఉద్యోగుల జీతభత్యా లు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్‌ కోసమే ఖర్చవుతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయంలో 54% తప్పనిసరి ఖర్చులకే వెచ్చించిందని కాగ్‌ తెలిపింది. రెవెన్యూ వ్యయం రూ.88,824 కోట్లలో రూ.45,770 కోట్లు జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్‌లకు ఖర్చు చేసినట్లు తేల్చింది. 

ఆర్థిక ఇబ్బందులు(ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వం ఇక్కట్లు)
సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక నిర్వహణ కోసం ప్రభుత్వం 2017–18 ఆర్థిక సంవత్సరంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొందని కాగ్‌ నివేదిక తెలిపింది. దీని ప్రకారం ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఆర్థిక నియంత్రణ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడు రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లి నిధులు సమకూర్చుకున్నట్టు తెలిపింది. ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లడం ద్వారా రూ.765 కోట్లు ప్రభుత్వం సమకూర్చుకుందని చెప్పింది. 127 రోజులపాటు వేస్‌ అండ్‌ మీన్స్‌ (రోజు వారీ ఖర్చుల కోసం)కు వెళ్లిందని, దీని ద్వారా రూ.10,789 కోట్ల సమకూర్చు కుందని తేల్చింది. మరో 204 రోజుల పాటు రిజర్వ్‌ బ్యాం క్‌ ఇచ్చే స్పెషల్‌ విత్‌డ్రాయల్‌ సౌకర్యా న్ని వాడుకుని రూ.11,278 కోట్లు తెచ్చుకుందని చెప్పింది.

ఆ ఆర్థిక సంవత్సరంలో ఓడీ, వేస్‌ అండ్‌ మీన్స్, స్పెషల్‌ విత్‌డ్రాయల్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుని దాదాపు రూ.22 వేల కోట్లు రాబట్టుకుని ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టినట్టు వెల్లడించింది.  కాగ్‌ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అవకతవకలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో భాగంగా జరిగే కొన్ని తప్పనిసరి సర్దుబాట్లు, పద్దుల మార్పులు లాంటి అంశాలను ఆర్థిక అవకతవకల కింద కాగ్‌ తప్పుపడుతుంది. అలాంటి వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద రూ.1,500 కోట్లు ఉన్నాయంది. కాళేశ్వ రం ప్రాజెక్టు భూసేకరణకు వాడిన ఈ నిధుల వినియో గం విషయంలో నిబంధనల ప్రకారం ఉపయోగించిన పద్దులను మార్చారని ఆక్షేపించింది. రుణమాఫీ కింద అంతకు ముందు ఏడాది మిగిలిన రూ.2 కోట్లకు పైగా నిధులను  సరిగా జమ చేయలేదని తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top