
కేసీఆర్ కుట్రపన్ని రేవంత్‌ను అరెస్ట్ చేయించారు
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్పై ఏసీబీ అధికారులతో చర్చించిన అనంతరం ఏసీబీ ప్రధానకార్యాలయం నుంచి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.
ఏసీబీ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుట్రపన్ని రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విచారణ నిమిత్తం ముందుగా స్టీఫెన్‌ను ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు అరగంట వ్యవధిలో రాత్రి 8 గంట లకు రేవంత్‌నూ తీసుకువచ్చారు. వారిని వేర్వేరు గదుల్లో విచారిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింలు, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయకుండా అడ్డుకునేందుకే రేవంత్‌ను అరెస్ట్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఏసీబీ డీజీని కలిసేందుకు అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏసీబీ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా, తన సోదరుడిని అక్రమంగా కేసులో ఇరికించారని, చంపేం దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నిం చగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.