
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ సింధీకాలనీలోని హెరిటేజ్ ప్రెష్‌పై పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి అక్రమంగా నిలువ ఉంచిన వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా గత కొద్ది నెలలుగా నూనెలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్ధార్‌లు గణపతిరావు, పుష్పలత, చాముండేశ్వరి ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం రాత్రి మాల్‌పై దాడులు నిర్వహించారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి 1700 లీటర్ల వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు.