‘గ్రామాన్ని దత్తత తీసుకుని రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశావంటూ’ వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావును నిలదీశారు.
ఎమ్మెల్యే ఎర్రబెల్లిని నిలదీసిన ప్రజలు
తొర్రూరు: ‘గ్రామాన్ని దత్తత తీసుకుని రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశావంటూ’ వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావును నిలదీశారు. మంగళవారం గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను సీపీఎం, సీపీఐ నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు.
వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘మరో ఆరు నెలలు ఓపిక పట్టండి. వచ్చే రెండేళ్లల్లో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా’ అని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.