శాలువాలు కప్పి  గోతులు తవ్వొద్దు  | Do not ignore false allegations in social media | Sakshi
Sakshi News home page

శాలువాలు కప్పి  గోతులు తవ్వొద్దు 

Mar 15 2019 3:14 AM | Updated on Mar 25 2019 3:09 PM

Do not ignore false allegations in social media - Sakshi

ఇల్లందకుంట (హుజూరాబాద్‌): సోషల్‌ మీడియాలో అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, తనకు ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టబోనని మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. కరీంనగర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతో మంచిగా ఉంటూ.. శాలువాలు కప్పి వెనకాల గోతులు తవ్వవద్దని ఈటల హితవు పలికారు. వెన్నుపోటు పొడవకుండా ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీని నమ్ముకొని ఉన్నవారికి సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement