
డివిజనల్ ఫారెస్టు అధికారిగా సోనబాలదేవి
డివిజనల్ ఫారెస్ట్ (టెరిటోరియల్) అధికారిగా సోనబాలదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టరేట్: డివిజనల్ ఫారెస్ట్ (టెరిటోరియల్) అధికారిగా సోనబాలదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టిన డీవీ రెడ్డి నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ శరత్‌ను కలిశారు. శాఖాపరమైన అంశాలపై ఆమె కలెక్టర్‌తో చర్చించారు. సోనబాలదేవికి గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. డోమా పీడీగా పనిచేశారు. జిల్లాలో పనిచేసిన అనుభవం ఉ న్న కారణంగా అటవీ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.