రామా.. ఎంత అపచారం! | Disservice in the Bhadrachalam Ram temple | Sakshi
Sakshi News home page

రామా.. ఎంత అపచారం!

Mar 7 2017 2:03 AM | Updated on Jul 29 2019 6:07 PM

రామా.. ఎంత అపచారం! - Sakshi

రామా.. ఎంత అపచారం!

భద్రాచలం రామాలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం

మూలవరులను తాకిన భక్తులు

భద్రాచలం: భద్రాచలం రామాలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు నేరుగా గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లి, స్వామి మూర్తులను తాకినట్లుగా తెలిసింది. గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లకూడదనే విషయం తెలియని సదరు భక్తులు, స్వామి సేవలో తరించాలనే అలా చేసి ఉంటారని ఆలయన అధికారులు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో భద్రాద్రి ఆలయంలో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో విధులు నిర్వహించే అర్చకులు అక్కడ లేకపోవడం గమనార్హం. విషయాన్ని కొంతమంది భక్తులు ఈవో రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్చకులు, సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని ఈవో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement