ఐటీ వినియోగంతోనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని ఐటీ మంత్రి కె.టి.రామారావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్ : ఐటీ వినియోగంతోనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని ఐటీ మంత్రి కె.టి.రామారావు అన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఐటీ ఉపయోగంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యపడుతుందని, అందుకోసం తీసుకోవాల్సిన చర్యల కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనుమతులన్నీ ఒకేచోట లభించేలా సింగిల్ విండో ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సెల్‌టవర్ల రేడియేషన్ కార ణంగా క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మ్యాథ్యూ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో పలు సెల్‌ఫోన్ కంపెనీలకు చెందిన 4800 టవర్లపై పరిశోధించగా వాటి రేడియేషన్‌తో సమీపంలోని మనుషులు, పక్షులు, జంతువులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టమైందని అన్నారు.