కార్మికులకు హెచ్చరిక; డ్రైవర్లపై దాడి చేస్తే చర్యలు తప్పవు

CP Anjani kumar Warned To RTC Unions For Attack On Private Drivers - Sakshi

పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్లకు ఆటంకం కలిగించి వారిపై దాడి చేస్తే చర్యలు తప్పవని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ హెచ్చరించారు. తమ డిమండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు గత 18 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యమ్నాయంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా బస్సులను నడిపిస్తుంది.

మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులు, మిగిలిన ప్రైవేటు వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను అడ్డుకుంటున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. సమ్మె చేస్తున్న యూనియన్లు ప్రైవేటు వ్యక్తులపై దాడి చేస్తున్నారని, అలా చేసే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న డ్రైవర్లకు ఆటంకం కలిగిస్తే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఫాస్టాక్‌ కోర్టు విచారణ ద్వారా వెంటనే శిక్ష పడుతుందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top