మహమ్మారి.. దారి మారి! 

Coronavirus Positive Cases Increasing In Hyderabad GHMC - Sakshi

తల్లిదండ్రులతో పిల్లలకు.. వారి ద్వారా వృద్ధులకు 

కాలు బయటపెట్టకున్నా కాటేస్తున్న కోవిడ్‌ 

వైద్యశాఖ పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవం వెల్లడి  

దావత్‌లు, వేడుకలతోనూ వ్యాప్తి చెందుతున్న కరోనా 

కలకలం రేపిన ఆ ఇద్దరి పుట్టిన రోజు వేడుకలు   

17 కుటుంబాల్లోని 66 మందికి సోకిన వైరస్‌ 

కొంప ముంచుతున్న పార్టీలు.. కామన్‌ బాత్‌రూమ్‌లు 

గ్రేటర్‌ పరిధిలో వెయ్యి దాటిన పాజిటివ్‌ కేసులు  

మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశంలో హరివిల్లు విరిస్తే.. అవి తమ కోసమేనని ఆనందించే చిన్నారుల పాలిట కరోనా మహమ్మారి అశనిపాతంలా పరిణమించింది. తల్లిదండ్రుల నుంచి వీరికి వైరస్‌ సోకుతోంది. అక్కడితోనే ఆగకుండా పిల్లలకు సన్నిహితంగా మెలిగిన తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలను సైతం కోవిడ్‌ వెంటాడుతోంది. ఇలా మూడు తరాల వారికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. అలాగే.. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అందరికీ ఆనందమే. దావత్‌ చేసుకోవడం ఇంటిల్లిపాదికీ సంతోషదాయకమే. కానీ ఈ వేడుకలే కొంపముంచుతున్నాయనేందుకు ఇటీవల సంతోష్‌నగర్‌ మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెలుగు చూసిన 39 పాజిటివ్‌ కేసుల ఘటనే నిదర్శనం.

అంతకు ముందు వనస్థలిపురంలోనూ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన 27 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇలా.. బర్త్‌డే పార్టీలైనా, దావత్‌లైనా మొత్తం కుటుంబాలనే విషాదంలోకి నెట్టివేస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులంతా కరోనాతో ఆస్పత్రిలో చేరుతుండటం, ఒక్కొక్కరూ ఒక్కో వార్డులో అనాథల్లా ఉండిపోవాల్సి రావడం, బాధితుల్లో ఎవరైనా చనిపోతే.. కనీసం వారిని కడసారి చూసేందుకు కూడా నోచుకోలేని దుస్థితి రావడం హృదయ విదారకం. ఇలా విభిన్న దారుల్లో కరోనా కోరలు సాచి వెంటాడుతోంది. (వలస కూలీలకు లోటు రానివ్వొద్దు)

సాక్షి,  హైదారాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో వృద్ధులెవరూ ఇంటి గడప దాటి బయటికి వెళ్లలేదు. కానీ వారిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. ఎలా? అని వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీయగా.. ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడిన వృద్ధుల్లో చాలా మందికి తమ ఇంట్లోని పిల్లల ద్వారానే వైరస్‌ సోకినట్లు గుర్తించింది. తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకు.. వారి నుంచి వృద్ధులకు వైరస్‌ సోకుతున్నట్లు స్పష్టమైనట్లు పేర్కొంది. ఇంట్లోని పిల్లలు ఖాళీ సమయంలో అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మల వద్దే ఎక్కువ సమయం గడుపుతుంటారు. పిల్లలు మారాం చేయడంతో వారిని ఎత్తుకోవడం, హత్తుకోవడం, ముద్డాడటం వంటివి చేస్తుంటారు. అప్పటికే నిత్యావసరాల పేరుతో మార్కెట్లకు వెళ్లి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు వైరస్‌ సోకడంతో ఆ తర్వాత వారి పిల్లలకూ సోకుతోంది. వీరిలో అసింప్టమెటిక్, మైల్డ్‌ సింటమ్స్‌ (వైరస్‌ లక్షణాలు బయటికి కన్పించకపోవడం) ఉండ టం వల్ల వైరస్‌ ఉన్నట్లు తెలియడం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులపై ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతోంది. తీరా వారు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి ఆస్పత్రుల్లో చేరుతుండటంతో అసలు విషయం బయటికి వస్తోంది. అప్పటికే నష్టం జరిగిపోతోంది. ఇంట్లో నుంచి కనీసం కాలు కూడా బయటపెట్టని ఈ వృద్ధులకు వైరస్‌ ఎలా సోకిందో తెలియక వారి బంధువులు తలపట్టుకుంటున్నారు. తీరా పిల్లల ద్వారానే వారికి సోకినట్లు తెలిసి షాక్‌ అవుతున్నారు.  (మరో 42 మందికి..)

కొంపముంచుతున్న వేడుకలు 
పిల్లల పుట్టిన రోజు వేడుకలు పెద్దల పాలిటశాపంగా మారుతున్నాయి. ఓ వైపు వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తుంటే.. మరో వైపు తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలను ఎంతో అట్టహాసంగా చేస్తున్నారు. బంధువులు, ఇరుగు పొరుగున ఉన్న సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. వారి ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉండటంతో వారు కూడా వెళ్లి వస్తున్నారు. అప్పటికే ఇంట్లోని వ్యక్తులకు వైరస్‌ ఉండటం, లక్షణాలు బయటపడకపోవడంతో తాము ఆరోగ్యంగా ఉన్నట్లు భావించి వేడుకలకు ఇతరులను ఆహ్వానించడం, అప్పటి వరకు అంతర్లీనంగా దాగి ఉన్న వైరస్‌.. వేడుకలకు హాజరైన ఇతర పిల్లలకు విస్తరిస్తోంది.  ఆ పిల్లల ద్వారా వారి ఇంట్లోని వృద్ధులకు విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. తాజాగా సంతోష్‌నగర్‌ మాదన్నపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఇక్కడి పిల్లలందరినీ వీటికి ఆహ్వానించారు. (ప్రైవేట్‌లోనూ కరోనా)

అపార్ట్‌మెంట్‌లోని 13 ప్లాట్స్‌లో 59 మంది వరకు ఉన్నారు. బర్త్‌డే బేబీ తండ్రికి కరోనా వైరస్‌ సోకినట్లు ఈ నెల 9న నిర్ధారణ అయింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న 54 మందిని క్వారంటైన్‌ చేసి, పరీక్షలు చేయగా.. 39 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో గర్భిణి సహా వృద్ధులు కూడా ఉన్నట్లు తెలిసింది. పిల్లల ద్వారానే పెద్దలకు వైరస్‌ విస్తరించి ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. అంతకు ముందు వనస్థలిపురం ఎ–క్వార్టర్స్‌లో ఉండే వ్యక్తి ఇటీవల ఇంట్లో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి హాజరైన సమీప బంధువులు, వారి డ్రైవర్, వంట మనిషి ఇలా మొత్తం 27 మంది వైరస్‌ బారిన పడాల్సి వచ్చింది.   

కామన్‌ బాత్‌రూమ్‌లూ..  
నగరంలోని చాలా బస్తీలు ఇరుకుగా ఉంటాయి. 100–120 గజాల స్థలంలో మూడు నాలుగు అంతస్తుల భవనాలు నిర్మిస్తుంటారు. శివారులోని పలు ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసి, కూలీలకు అద్దెకు ఇస్తుంటారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సాన్నాల గదులు నిర్మించరు. అందరికీ కలిపి కా మన్‌గా ఒకటి రెండు బాత్‌రూమ్‌లనే ఏర్పాటు చేస్తుంటారు. ఇంటి ప్రాంగణంలో ఉన్న వారిలో ఏ ఒక్కరికి కరోనా వైరస్‌ సోకినా.. వారి ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదు. తాజాగా మంగళ్‌హాట్‌ పరిధిలోని కామటిపురకు చెందిన ఓ సేల్స్‌ మేనేజర్‌కు ఇటీవల కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయింది. అదే ఇంట్లోని ఆరు కుంటుంబాలు ఉన్నాయి. వీరందరికీ కామన్‌గా ఒకే బాత్‌రూమ్‌ ఉండటం, ఒకరు వాడిన తర్వాత మరొకరు వినియోగించడం వల్ల కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఆ తర్వాత ఇదే బాత్‌రూమ్‌ ద్వారా మొత్తం 24 మందికి వైరస్‌ సోక డం విశేషం.  

గ్రేటర్‌లో 168 కుటుంబాలు.. 1008 మందికి ఎఫెక్ట్‌   
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 2 నుంచి ఈ నెల 16వ తేదీ నాటికి 485 కుటుంబాల్లో 1509 మంది కరోనా వైరస్‌ బారిన పడితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 168 కుటుంబాల్లోని 1008 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కుటుంబంలో సగటున ఆరుగురు వైరస్‌ బారిన పడినట్లు అంచనా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-08-2023
Aug 11, 2023, 10:12 IST
కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరి గుండెలో గుబులు పడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గజగజ వణికించింది....
13-06-2023
Jun 13, 2023, 05:33 IST
న్యూఢిల్లీ:  కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం తీసుకొచ్చిన కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను...
27-05-2023
May 27, 2023, 05:51 IST
వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్‌ కోవిడ్‌ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో...
15-04-2023
Apr 15, 2023, 05:40 IST
లండన్‌: కోవిడ్‌–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా...
13-04-2023
Apr 13, 2023, 06:19 IST
న్యూఢిల్లీ: తగిన డిమాండ్‌ లేకపోవడం, కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా ఉత్పత్తిని తాజాగా...
09-04-2023
Apr 09, 2023, 04:19 IST
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్‌ కేసులు 31,194కు చేరినట్లు...
08-04-2023
Apr 08, 2023, 04:44 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ...
03-04-2023
Apr 03, 2023, 06:01 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఆరు...
28-03-2023
Mar 28, 2023, 06:06 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం...
26-03-2023
Mar 26, 2023, 03:09 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభు­త్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల...
20-03-2023
Mar 20, 2023, 05:21 IST
గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్‌ సోకిన భారతీయుల్లో 35...
19-03-2023
Mar 19, 2023, 04:06 IST
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్‌ మార్కెట్‌లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా...
18-03-2023
Mar 18, 2023, 04:25 IST
కరోనా వైరస్‌ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమించిందని భావిస్తూ ఉంటే...
04-03-2023
Mar 04, 2023, 14:06 IST
కోవిడ్‌ వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వీ'ని రూపొందించడంలో సహకరించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆండ్రీ బోటికోవ్‌ ఒకరు.
22-01-2023
Jan 22, 2023, 06:21 IST
చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసిన నాటి నుంచీ కరోనాకు చెందిన అనేక వేరియెంట్లు... విడతలు విడతలుగా, తడవలు తడవలుగా వేవ్‌లంటూ...
14-01-2023
Jan 14, 2023, 05:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి...
14-01-2023
Jan 14, 2023, 04:56 IST
బీజింగ్‌: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారు. పెకింగ్‌...
11-01-2023
Jan 11, 2023, 18:10 IST
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ...
08-01-2023
Jan 08, 2023, 09:48 IST
గుంటూరు మెడికల్‌ : అమెరికా నుంచి గుంటూరు వచ్చిన దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సుమారు పదిరోజుల కిందట ముత్యాలరెడ్డినగర్‌కు...
08-01-2023
Jan 08, 2023, 05:58 IST
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్‌ యున్‌’లూనార్‌ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి...



 

Read also in:
Back to Top