వర్ని మండలం రుద్రూర్ వ్యవసాయ పరిశోధ నా కేంద్రంలో ‘కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (ఆహార శాస్త్ర, సాంకేతిక...
ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక నాయకులు
వర్ని: వర్ని మండలం రుద్రూర్ వ్యవసాయ పరిశోధ నా కేంద్రంలో ‘కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (ఆహార శాస్త్ర, సాంకేతిక కళాశాల) ఏర్పాటుకు బుధవా రం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలి పింది. ఏడాదికి 40 మంది చొప్పున విద్యార్థులకు ఈ కోర్సును అందించనున్నారు. పరిశోధనా కేంద్రంలోనే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఇప్పటికే సీడ్ టెక్నాలజీ కోర్సును నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
ఇపుడు మంత్రివర్గం ఆమోదంతో కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో ఈ కళాశాల మంజూరైందని వర్ని జడ్‌పీటీసీ సభ్యుడు గు త్ప విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోనే ఇది ప్రథమ కళాశాల అని పే ర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఈ కళాశాలను ఏర్పాటు చే యడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పరిశోధానా కేంద్రానికి పూర్వ వైభవం వస్తుందని, మంత్రికి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలి పారు. కళాశాల ఆమోదం తెలపడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చే స్తున్నారన్నారు.