సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీ

CM makes surprise visit to Police Command and Control Center - Sakshi

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడెకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సెంటర్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

శాంతిభద్రతలతో పాటు విపత్తుల నిర్వహణ, పండగలు, జాతరల నిర్వహణ తదితర కార్యక్రమాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చని సీఎం చెప్పారు. సీఎం వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆరూరి రమేశ్, గంగుల కమలాకర్, అరికెపూడి గాంధీ, సంజీవరావు, అర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top