‘పాలమూరు’పై సీఎం కేసీఆర్ ఆరా! | Cm Kcr Inquires on Paalamuru | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’పై సీఎం కేసీఆర్ ఆరా!

Aug 31 2015 1:34 AM | Updated on Aug 14 2018 10:54 AM

పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఫోన్‌చేసి ఆరాతీశారు

అడ్డాకుల : పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఫోన్‌చేసి ఆరాతీశారు. మండలంలోని గాజులపేట గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్‌చేశారు. స మావేశంలో ఉన్న ఆయన దూరంగా వెళ్లి ఫోన్‌లో మాట్లాడారు. ‘భూత్పూర్ మండలం కర్వెన వద్ద నిర్మంచనున్న రిజర్వాయర్ పనులకు సం బంధించిన సర్వే ఎంతవరకు వచ్చింది.. ఎంతమంది రైతులతో మాట్లాడారు.. రైతుల జాబితా సిద్ధం చేశారా.. భూములు కోల్పోయే వారికి అన్ని సౌకార్యలు కల్పిద్దాం..తొందరగా పనులు మొదలు పెట్టేలా చూడండి’ అని సీఎం కేసీఆర్ ఫోన్‌లో తనతో మాట్లాడినట్లు అక్కడ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆల వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ పనులను తొందరగా మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా కరువు తీరిపోతుందని ఎమ్మెల్యే ఆల పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement