breaking news
MLA Venkateshwara Reddy
-
ఎమ్మెల్యే కారు ఢీ.. వృద్ధుడు మృతి
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందాడు. నియోజక వర్గంలో పర్యటనకు మంత్రి జూపల్లి కారులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కొత్తకోటకు వెళ్లారు. దారిలో డీజిల్ అయిపోవడంతో నింపుకొని వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతులమడుగు గ్రామానికి చెందిన వెంకటయ్య (59) అక్కడికక్కడే మృతి చెందాడు. -
‘పాలమూరు’పై సీఎం కేసీఆర్ ఆరా!
అడ్డాకుల : పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఫోన్‌చేసి ఆరాతీశారు. మండలంలోని గాజులపేట గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్‌చేశారు. స మావేశంలో ఉన్న ఆయన దూరంగా వెళ్లి ఫోన్లో మాట్లాడారు. ‘భూత్పూర్ మండలం కర్వెన వద్ద నిర్మంచనున్న రిజర్వాయర్ పనులకు సం బంధించిన సర్వే ఎంతవరకు వచ్చింది.. ఎంతమంది రైతులతో మాట్లాడారు.. రైతుల జాబితా సిద్ధం చేశారా.. భూములు కోల్పోయే వారికి అన్ని సౌకార్యలు కల్పిద్దాం..తొందరగా పనులు మొదలు పెట్టేలా చూడండి’ అని సీఎం కేసీఆర్ ఫోన్లో తనతో మాట్లాడినట్లు అక్కడ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆల వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ పనులను తొందరగా మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా కరువు తీరిపోతుందని ఎమ్మెల్యే ఆల పేర్కొన్నారు. -
వలసలు నివారించడమే లక్ష్యం
70టీఎంసీల నీటిని నిల్వచేసుకుందాం పరిశ్రమలు స్థాపించే వారిని అడ్డుకోవద్దు ఎంపీ ఏపీ.జితేందర్‌రెడ్డి అడ్డాకుల : కరువు జిల్లాగా పేరొందిన పాలమూరు నుంచి కూలీల వలసలను నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భా గంగా జిల్లాలో 70టీఎంసీల నీటిని నిల్వచేసుకుని జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మండలంలోని అడ్డాకుల, కాటవరం, గాజులపేట గ్రా మాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారిని అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ నిపుణులతో చర్చిస్తున్నారని త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ఒక్కపైసా అవినీతి జరగకుండా కేసీఆర్ పరిపాలిస్తున్నందున అందరూ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఎంపీ జితేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు నీళ్లందిస్తామన్నారు. కార్యక్రమాల్లో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటయ్యగౌడ్, స్నేహాఫామ్స్ అధినేత రాంరెడ్డి, ఎంపీపీలు బగ్గి కమలమ్మ, ఈవీ గోపాల్, జెడ్పీటీసీ సభ్యుడు రామన్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు మైమూద్, పార్టీ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచులు కె.రఘు, వడ్డే నర్సమ్మ, సరస్వతమ్మ, నాగిరెడ్డి, ఇంద్రయ్యసాగర్, భాస్కర్‌గౌడ్, వైస్ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి, శ్రీనివాసులు, శెట్టిశేఖర్, హేమ్లీ, స్నేహాఫామ్స్ నిర్వాహకులు రామేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.