
సీసీ కెమెరా ఫుటేజీలో ‘ఏటీఎం నిందితులు’
ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించిన దుండగుల చిత్రాలు సీసీ కెమెరాకు చిక్కాయి.
షాబాద్: ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించిన దుండగుల చిత్రాలు సీసీ కెమెరాకు చిక్కాయి. సోమవారం రాత్రి షాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు యంత్రాన్ని ధ్వంసం చేసి చోరీకి యత్నించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం బ్యాంక్ ప్రతినిధి విజయ్‌కుమార్ ఏటీఎం సెంటర్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. చోరీకి యత్నించిన ఇద్దరు దొంగల చిత్రాలు అందులో కనిపించాయి. ఈవిషయమై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆయన సీసీ టీవీ ఫుటే జీని పోలీసులకు అప్పగించారు.