బాల్య వివాహానికి బ్రేక్ | Break for child marriage | Sakshi
Sakshi News home page

బాల్య వివాహానికి బ్రేక్

Dec 15 2014 4:32 AM | Updated on Sep 2 2017 6:10 PM

తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణరుుంచిన తల్లిదండ్రులు ఆదివారం నిశ్చితార్థం చేసేందుకు సిద్ధం కాగా అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు.

ధర్మసాగర్ : తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణరుుంచిన తల్లిదండ్రులు ఆదివారం నిశ్చితార్థం చేసేందుకు సిద్ధం కాగా అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కూతాటి  సారయ్య, రజిత దంపతుల కూతురు సునీత(14)కు కరీంనగర్ జిల్లా భీమదేవపల్లి మండలం ఎర్రబెల్లికి చెందిన యువకుడితో వివాహం చేయూలని కుటుంబ సభ్యులు ఇటీవల నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యులు ధర్మసాగర్‌లో పూలుపండ్ల కార్యక్రమం నిర్వహిస్తుండగా అంగన్‌వాడీ  కార్యకర్తలు, మహిళలు చేరుకుని అడ్డుకున్నారు. బాల్య వివాహం చేయడం సరికాదని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అమ్మాయి మేజర్ అయ్యాకే వివాహం చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులతో హామీ  తీసుకున్నారు. సర్పంచ్ కే.రజిత, అంగన్‌వాడీలు వసంత, బేబిరాణి, మహిళలు జుబేదా బేగం, రాధిక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement