క్యాబ్‌లకు బ్రేక్‌...

Break to the cabs - Sakshi

పలు మార్గాల్లో నిలిచిపోయిన ఓలా, ఉబెర్‌ సర్వీసులు 

కొనసాగుతున్న క్యాబ్‌ డ్రైవర్ల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం రెండోరోజు కూడా పలు మార్గాల్లో సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్, ఈసీఐఎల్, కుషాయిగూడ, హైటెక్‌సిటీ, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర రూట్లలో ఓలా, ఉబెర్‌ సర్వీసులకు బ్రేక్‌ పడింది. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  మరోవైపు హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, తదితర ఐటీ కారి డార్‌లలోనూ క్యాబ్‌ సేవలు నిలిచి పోయాయి. దీంతో ఆ మార్గాల్లో పనిచేసే ఉద్యోగులు, ఐటీ నిపుణులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.

ఓలా, ఉబెర్‌ సంస్థల్లో నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ వాతా వరణం, రోజుకు 18 నుంచి 20 గంటలపాటు పని చేసినా రుణాలు చెల్లించలేని దుస్థితి, ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్‌డ్రైవర్ల ఆత్మహత్యల నేపథ్యంలో డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వందలాది మంది క్యాబ్‌డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు శివతోపాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

ప్రత్యేక యాప్‌ కోసం డ్రైవర్ల డిమాండ్‌...
ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ సంస్థల్లో సుమారు 1.5 లక్షల క్యాబ్‌లున్నాయి. చాలా మంది డ్రైవర్లు రూ.లక్షల్లో అప్పు చేసి వాహనాలను కొనుగోలు చేశారు. మొదట్లో పెద్ద ఎత్తున ఆదాయం, ప్రోత్సాహకాలు లభించడంతో చాలామంది డ్రైవర్లు ఓలా, ఉబెర్‌లకు బారులు తీరారు. డ్రైవర్‌ల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో సదరు సంస్థలు  ప్రోత్సాహకాలకు కోత విధించి, కమీషన్‌లను పెంచుకున్నాయి. దీంతో గతంలో నెలకు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించిన డ్రైవర్‌కు ఇప్పుడు రూ.25 వేలు కూడా లభించడం లేదు.  దీంతో వాహన రుణాలు చెల్లించడం, భార్యా పిల్లలను పోషించుకోవడం కష్టంగా మారింది. దీంతో డ్రైవర్లు ‘ఓలా, ఉబెర్‌ క్యాబ్‌కు హఠావో, డ్రైవర్‌కు బచావో’అనే నినాదంతో  ఆందోళనకు దిగారు. లక్షలాదిమంది డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వమే ఒక యాప్‌ను రూపొం దించాలని, డ్రైవర్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top