లండన్‌ ససెక్స్‌లో ఏం జరిగింది..!? | Sakshi
Sakshi News home page

లండన్‌ ససెక్స్‌లో ఏం జరిగింది..!?

Published Mon, Sep 16 2019 11:22 AM

BJP Leader Son Missing In London - Sakshi

సాక్షి, ఖమ్మం: గత నెల 21న లండన్‌ లో కనిపించకుండా పోయిన ఖమ్మం జిల్లా బీజీపే అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్‌  కుమారుడు ఉజ్వల  శ్రీహర్ష మిస్టరీ ఇంకా వీడలేదు. లండన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లి అదృశ్యమైన ఖమ్మం నివాసి సన్నె శ్రీహర్ష ఆచూకీ  లభ్యంకాలేదు. దీనిపై శ్రీహర్ష తండ్రి సన్నె ఉదయ్‌ప్రతాప్‌ ఆదివారం లండన్‌ నుంచి ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు.  ఆయన చెప్పిన మాటల ప్రకారం.. కొంతకాలం క్రితం లండన్‌లోని కియో యూనివర్సిటీ వారు శ్రీహర్షను ఓ ప్రాజెక్టు పనిమీద జపాన్‌కు పంపించారు. అక్కడ కొన్నాళ్లు ఉండి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేశాడు. ఆ ప్రాజెక్టులో 80 శాతం మార్కులతో టాప్‌గా నిలిచాడు.

దీంతో  వారు మరో ప్రాజెక్టు  పత్రాల సమర్పణ కోసం నెదర్లాండ్స్‌ పంపించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో   ఆగస్టు 21న  జపాన్‌కు చెం దిన  ఫోన్‌ నంబర్‌ (+81)0806554 నుంచి శ్రీహర్షకు సమాచారం అందింది. ససెక్స్‌ ప్రాంతానికి రమ్మని, అక్కడ మాట్లాడుకుందామని సమాచారం   రావటంతో లండన్‌కు 130 మైళ్ల దూరంలో ఉన్న ససెక్స్‌కు ఉదయం 9 గంటలకు బయలు దేరాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నుంచే శ్రీహర్ష ఆచూకీ లభించకుండా పోయింది .   

ఎక్కడికి వెళ్లినట్లు.. 
ససెక్స్‌ ప్రాంతానికి వెళ్లిన దగ్గర నుంచే శ్రీహర్ష  కనిపించకుండా పోయాడు. అసలు అక్కడికి రమ్మన్నది ఎవరు.. గతంలో  ప్రాజెక్టు కోసం జపాన్‌కు వెళ్లిన శ్రీహర్షకు అక్కడి ప్రొఫెసర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారు ఏమైనా సమాచారం అందించారా.. వారు సమాచారం ఇస్తే యూనివర్సిటీ నుంచి ఇస్తారు. ప్రత్యేకంగా  ఎందుకిస్తారనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఒకవేళ జపాన్‌కు చెందిన వారు శ్రీహర్షను అక్కడికి రప్పించారా.. అక్కడికి రప్పించిన వారు ఏంచేసి ఉంటారని తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  లండన్‌ పోలీసులు  జపాన్‌ నుంచి వచ్చిన ఫోన్‌ నంబర్‌ ఎవరిది.. వారు ఎందుకు  సమాచారం అందించి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తే  శ్రీహర్ష ఆచూకీ తెలిసే అవకాశముంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement