ఎన్నికల హోరు.. ‘బిర్యానీ’ జోరు

Biryani Was Shortage In Election Time - Sakshi

హోటళ్లలో దొరకని  బిర్యానీ..

రాజకీయ సభలకే  ఆర్డర్లు

 సాక్షి, రాజేంద్రగనర్‌: నియోజకవర్గ పరిధిలోని హోటళ్లలో తినేందుకు బిర్యానీ లభించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో   బిర్యానీ కొరత నెలకొంటోంది. సాధారణ రోజుల్లో రాత్రి వరకు లభించే బిర్యానీ ప్రస్తుతం ఆర్డర్‌ ఇచ్చినా దొరకడంలేదు.  హైదర్‌గూడ, అత్తాపూర్, ఆరాంఘర్‌ చౌరస్తా, దుర్గానగర్, శంషాబాద్, నార్సింగి తదితర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లు బిర్యానీకి పెట్టింది పేరు.

ఈ ప్రాంతాలలోని హోటళ్లలో బిర్యానీ తినేందుకు స్థానిక ప్రాంత వాసులతో పాటు ప్రయాణికులు, వాహనాదారులు ఆసక్తి చూపుతారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ హోటళ్లల్లో బిర్యానీ అమ్మకాలు జోరుగా సాగుతాయి.

ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీ అభ్యర్థులతో పాటు స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. తమ తమ అనుచరులకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో బిర్యానీలను భోజనంగా అందజేస్తున్నారు. దీంతో బిర్యానీలకు కొరత ఏర్పడింది. ఇదేమని అడిగితే ఎన్నికల సీజన్‌ కదా.. అని యజమానులు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top