భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష | Bhadrachalam MLA indefinite fast against Polavaram Ordinance | Sakshi
Sakshi News home page

భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

May 30 2014 3:30 AM | Updated on Aug 21 2018 8:34 PM

ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం ఆమరణ దీక్షకు దిగారు.

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నేడు ముంపు మండలాల్లో బంద్
 భద్రాచలం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపునకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం ఆమరణ దీక్షకు దిగారు. పినపాక నియోజకవర్గ సీపీఎం డివిజన్ కార్యదర్శి కనకయ్యతోపాటు మరో 15 మంది రాజయ్యకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రాచలం డివిజన్‌లోని సెంటు భూమిని కూడా వదులుకునేది లేదన్నారు. కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలను విరమించేది లేదన్నారు. కాగా, ముంపు మండలాల్లో శుక్రవారం బంద్ నిర్వహించేందుకు అఖిల పక్షం నాయకులు పిలుపునిచ్చారు. జూన్ 2న వీఆర్ పురం మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement