నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ఉట్నూర్‌లో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.
గాంధారి: నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ఉట్నూర్‌లో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గురువారం గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లిన ఉపాధి కూలీల వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. వారం రోజులుగా ఏదో ఒక చోట ఎలుగు బంటి కనిపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, అడవి జంతువులు నీటి కోసం అన్వేషిస్తూ జనావాసాల సమీపంలోకి ప్రవేశిస్తున్నాయని, ఎలుగుబంటిని తిరిగి అడవిలోకి పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.